Description
“సంఘ సభ్యత్వం అనేది కేవలం పేరు కోసం లేదా ఆచారం కోసం కాదు. అది ఒక ప్రతిజ్ఞ. అంటే, “నేను క్రీస్తుతో, ఆయన సంఘంతో ఐక్యంగా ఉన్నాను, ఆయనకు చెందినవాడిని” అని బహిరంగంగా ప్రకటించుకోవడం. నేడు చాలామంది క్రైస్తవ విశ్వాసాన్ని తేలికగా, కట్టుబడి లేని విధంగా చూస్తున్నారు. అలాంటి సమయంలో ఈ పుస్తకం సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఇది విశ్వాసులను జవాబుదారీత్వం గల శిష్యత్వానికి, ప్రేమపూర్వకమైన విధేయతకు, మరియు స్థానిక సంఘంలో చురుకైన ప్రమేయం కలిగి ఉండటానికి ప్రోత్సహిస్తుంది.”
– డేనియల్ సూర్య అవులు, సంఘ కాపరి మరియు రచయిత
“19వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ క్రైస్తవ బోధకుడు చార్లెస్ స్పర్జన్ గారు సంఘం గురించి ఇలా చెప్పారు: ‘తన సంఘం కంటే దేవుని హృదయానికి ఎక్కువ ప్రియమైనది ఈ లోకంలో ఏదీ లేదు. కాబట్టి, ఆయన సంఘానికి చెందినవారమై, మన ప్రార్థనల ద్వారా, మన కానుకల ద్వారా, మన ప్రయాసల ద్వారా దానికి తోడ్పడి, దానిని బలపరుద్దాం.” దీనిని ప్రతి సంఘ సభ్యుడు ఆచరణలో ఎలా చేయాలో స్పష్టమైన వివరణ సోదరుడు స్టీఫెన్ డేవిడ్ గారు రచించిన “వాక్యానుసారమైన సంఘ సభ్యుల 10 లక్షణాలు” అనే పుస్తకంలో ఉంది. నేను ఈ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నాను, మరియు ప్రతి విశ్వాసి దీనిని చదివి మంచి సంఘ సభ్యుడు కావాలని నేను కోరుకుంటున్నాను.”
– ఇమ్మాన్యాయేల్ ఆకిపోగు, సంఘ కాపరి మరియు రచయిత
“ప్రస్తుత తెలుగు క్రైస్తవ సంఘం ప్రమాదంలో ఉంది. దారుణమైన నిర్ణక్ష్యానికి గురవుతోంది. అందుకు కారణం ఎవరు? మనమే. ఈ ఇబ్బందికరమైన సత్యాన్ని చాలా సూటిగా చెబుతోంది ఈ పుస్తకం. స్థానిక సంఘ విషయంలో నైతికత, బాధ్యత, నిబద్ధత, ఐక్యత, జవాబుదారీతనం, సువార్తిక ఆసక్తి కొరవడినప్పుడు సంఘం… అంటే మనం… ఒక నిర్జీవ సమూహంగా మిగిలిపోతాం. ఒకవైపు ఆ ప్రమాదాన్ని ఎత్తిచూపిస్తూ, మరోవైపు వాక్యానుసారమైన నియమాలను పాటించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు స్టీఫెన్ డేవిడ్ గారు. నిస్సందేహంగా, ఈ పుస్తకం, ప్రతి విశ్వాసిని అప్రమత్తం చేస్తుంది. ప్రతి సంఘకాపరిని కార్యోన్ముఖున్ని చేస్తుంది.”
– సురేష్ వంగూరి , సంఘ కాపరి మరియు రచయిత









Reviews
There are no reviews yet.